ఏమాత్రం మొహమాటం లేకుండా వారసులకు టికెట్లు ఇచ్చేదిలేదని తేల్చేసిన సీఎం జగన్

ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే రాజకీయ వేడి కొనసాగుతుంది. పార్టీల నేతలు తమ ప్రచారం తో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను గద్దె దించాలని టీడీపీ చూస్తుంటే..వైస్సార్సీపీ మాత్రం 175 కు 175 గెలిచి తీరాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ తరుణంలో నేతలకు సీఎం జగన్ స్వీట్ వార్నింగ్ లు ఇస్తూ వస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నేతల పనితీరు మార్చుకోకపోతే టికెట్ ఇచ్చేది లేదని , ఇదే సమయంలో కొందరు తమ కుటుంబ సభ్యుల ను ప్రమోట్ చేస్తున్నారంటూ వారసుల అంశం పైన కూడా సీఎం రియాక్ట్ అయ్యారు. కొంత మంది తాము తిరగకుడా తమ వారసులు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారని చెబుతున్నారని, అవి కుదరవని సీఎం తేల్చి చెప్పారట. మీ బిడ్డలను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. కానీ, ఎన్నికల్లో మాత్రం మీరే ఈ సారి పోటీ చేయాలంటూ జగన్ చాలా క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తుంది.

ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్.. మాజీ మంత్రి పేర్ని నాని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారని సీఎం పార్టీ నేతల సమావేశంలో ప్రస్తావించారు. ఆ సమయంలోనే పేర్ని నాని తాను పార్టీ కోసం పూర్తి సమయం కేటాయిస్తున్నానని, ఎన్నికల్లో మాత్రం తన కుమారుడు పోటీ చేస్తారంటూ చెప్పే ప్రయత్నం చేసారు. దీనికి సీఎం అందరి సమక్షంలోనే క్లారిటీ ఇచ్చారు. ఈ సారి మీ ఇద్దరూ పోటీ చేయాల్సిందే, నాతో మీరిద్దరూ ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే మంత్రి బుగ్గనను మెల్లగా హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఆర్దిక మంత్రిగా ఉంటూ నియోజకవర్గంలో తిరగకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఎక్కడైతే పార్టీ నేతలు ఇంటింటికి గడప నిర్వహిస్తున్నారో ఆ గ్రామంలో పార్టీ నేతల ఇంట్లో భోజనం చేయాలని సూచించారట.