మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆధిక్యం

brs

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 7, మజ్లిస్, బీఆర్ఎస్ ఒక్కోచోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అసలు ఎక్కడా కనీసం పోటీలో లేదని భావించిన బీఆర్ఎస్ అనూహ్యంగా ముందుకు వచ్చింది. మెదక్ లోక్ సభ స్థానంలో బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలో నిలిచారు. తెలంగాణలో బీఆర్ఎస్ కేవలం మెదక్‌లో మాత్రమే ముందంజలో ఉంది. హైదరాబాద్ నుంచి మజ్లిస్ పార్టీ అధిక్యంలో ఉంది. మిగిలిన 15 చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌లు ఆధిక్యంలో ఉన్నాయి.