రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఫై బిఆర్ఎస్ ఆగ్రహం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం.. వెంటనే శంకుస్థాపన కూడా చేసేశారు. ‘ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భం. విగ్రహావిష్కరణకు సోనియాగాంధీని పిలుస్తాం. అంబేడ్కర్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి వంటివారి విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాయి. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాజీవ్ విగ్రహం మాత్రం లేదు’ అని ఆయన గుర్తుచేశారు.

అయితే ఈ నిర్ణయాన్ని బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే యోచనను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సూచించారు. ఆ ప్రదేశాన్ని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు గత ప్రభుత్వం నిర్ణయించిందని ఓ లేఖలో సర్కారుకు గుర్తుచేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని మరుగుపరిచే విధంగా కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. విగ్రహం ఏర్పాటు నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.