టిఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి

రెండు సార్లు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలుపు

kaveti sammaiah
kaveti sammaiah

కాగజ్‌నగర్‌: కొమురం భీం జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గం మాజి ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య(63) నేడు అనారోగ్యంతో మృతి చెందారు. కాగా ఈయన 2009, 2010 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ తరపున పోటి చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపోందారు. 2014 ఎన్నికల్లో పోటి చేసినప్పటికి ఓటమిపాలయ్యారు. కాగా 2018 లో టిఆర్‌ఎస్‌ పార్టికి రాజినామా చేసి కాంగ్రెస్‌ పార్టిలో చేరారు. కాగా కావేటి మరణ వార్త విని సిఎం కెసిఆర్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/