పవన్ కళ్యాణ్ “BRO” రిలీజ్ డేట్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘BRO’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. తమిళ చిత్రం వినోదయ సీతమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. అలాగే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ సరసన రొమాంటిక్ సినిమా హీరోయిన్ కేతికా శర్మ కనిపించనున్నారు. ఇక ఈ మూవీ ని జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు.