బస్సు ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ విచారం

విజయవాడ: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బుధవారం జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చిన్నారావుతో సహా తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటం బాధాకరమని గవర్నర్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన గవర్నర్ హరిచందన్.. సహాయ చర్యలు వేగవంతం చేసి మృతుల సంఖ్య పెరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/