సుకుమార్ – అల్లు అరవింద్ లతో అనుపమ స్టెప్స్

కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న నిఖిల్ – అనుపమ జంట..తాజాగా 18 పేజెస్ తో మరో హిట్ అందుకున్నారు. ప్రతాప్ తెరకెక్కించిన 18 పేజెస్ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే అభిమానులను పూర్తి స్థాయిలో ఈ మూవీ అలరించలేకపోయినప్పటికీ..వన్ టైం మాత్రం సినిమాను చూడొచ్చు.

నందిని అనే యువతి డైరీ నేపథ్యంలో సాగే విభిన్నమైన ప్రేమకథగా రూపొందిన ఈ మూవీ రిలీజ్ కి ముందే బ్రేక్ ఈవెన్ ని సాధించి ఈ మూవీ నాన్ థియేట్రికల్ శాటిలైట్ రైట్స్ పరంగా రూ. 22 కోట్లని రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం రాత్రి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో హీరో నిఖిల్ , అనుపమ, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, సుకుమార్, బన్నీ వాసుతో పాటు ప్రియాంక జవాల్కర్ ప్రియా వడ్లమాని చందూ మొండేటి బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు.

ఈ పార్టీలో అనుపమ తో కలిసి అల్లు అరవింద్ సుకుమార్ కలిసి ప్రత్యేకంగా స్టెప్పులేశారు. అనుపమ స్టెప్స్ చూపిస్తూ కొరియోగ్రఫీ చేస్తుంటే తనని అనుకరిస్తూ అల్లు అరవింద్ సుకుమార్ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసాడు.