మేనరికాలతో దుష్ప్రరిణామాలు

అనాదిగా మేనరికాలు, దగ్గరి సంబంధీకుల్లో వివాహాలు చేసుకోవడం పరిపాటి. ఇది కుల, ప్రాంత, వర్గ, మత సంప్రదాయాలకు అనుగుంణా అన్ని వర్గాల ప్రజల్లో ప్రబలి ఉండే విశ్వాసం. మేనరిక వివాహాలు అంశం. అయినప్పటికీ చాలా మంది ఆస్తులు. అంతస్తుల కోసం, పట్టింపుల కోసం వంటి అనేక కారణాల వల్ల మేనరిక వివాహాలు, రక్త సంబంధీకుల్లో వివాహాలు చేసుకోవడం సర్వ సాధారణమై సాంఘిక అంశంగా పూర్వకాలం నుండి అనాదిగా వస్తుంది. అయితే నేడు సైన్స్ ఎంతో పురోగతి చెందడం వల్ల వీరి రక్తంలోకి జెనిటిక్ మ్యూటేషన్ వల్ల అనేక దుష్పరిణాలు, వ్యాధులు హల్లుతున్నాయని వారికి పుట్టే సంతానం ఎన్నో ఆరోగ్యపరమైన వ్యాధులతో సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా 1/5 మంది ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో రక్తసంబంధీకుల్లో వివాహాలు జరుగుతున్నాయని అంచనా. వావి వరుసల దృష్టా కూడా హిందు, క్రైస్తవ మతంలో మేనమామ కూతుర్లకి, ముస్లిం మతంలో పెదతండ్రి, పిన తండ్రి పిల్లల మధ్య వివాహాలు ప్రోత్సహించబడేవి. అలాగే ప్రాచీన ఈజిప్ట్‌లో కొన్ని రాజకుటుంబీకుల్లో కూడా వారి వంశంలోని రాచరికపు రక్తం కలుషితం కాకూడదని, ధనవంతులు వారి ఆస్తులు బైట వాళ్లు అనుభవించకూడదని దగ్గరి బంధువులకివ్వడం జరిగితే, క్రిందిస్థాయి వాళ్లు కట్నం ఇచ్చుకోలేక, ఇతర ఆర్ధిక, సామాజిక, సాంఘిక కారణాల వల్ల మేనరికాలు, రక్త సంబంధీకుల్లో వివాహాల్ని ప్రత్సహించేవారు.
దాదాపు 20- 25 మంది అనర్థాలకు, అనారోగ్యాలకు దారి తీసే మేనరికాలకు మొగ్గు చూపడం వల్ల వారికి కలిగే సంతానం అనేక వంశ పారంపర్య వ్యాధులతో బాధపడాల్సి ఉంటుంది. 1902లో డాక్టర్ ఎ.ఇ.గెరాడ్ మేనరిక వివాహాల వల్ల వచ్చే వ్యాధులు జీవరసాయన వ్యవస్థపై మ్యూటెంట్ జీన్స్ ప్రభావం, కలిగే దుష్పరిణామాల గురించి ‘ఇన్‌బీర్న్ ఎర్రర్స్ అనే పుస్తకంలో వివరించడమైంది. తల్లిదండ్రుల్లో లేదా వారి పూర్వీకుల్లో ఏ ఒక్కొక్కరిలోనైనా వ్యాధికి సంబంధించిన జీన్స్ ఉంటే పుట్టిన వారిలో ఆ వ్యాధి బైట పడొచ్చు లేదా బహిర్గం కాకపోవచ్చు. ఎందుకంటే భార్యభర్తలిద్దరూ ఎంత ఆరోగ్యవంతులైన వారి క్రోమోజోమ్స్‌లో తరతరాలుగా వంశ పారంపర్య వ్యాధుల్ని మోసుకొచ్చే జీన్స్ ఉంటాయి.
లేదా తర్వాత తరంలో జీన్స్ మ్యూటేషన్ జరిగి అనేక కొత్త వ్యాధులు రావడానికి అస్కారం ఉంది. అలాగే రెసిసివ్ జీన్స్ భార్యభర్తలిద్దరిలో ఉన్నట్లయితే మరుగుపడ్డ అనేక వ్యాధులు బైట పడవచ్చు. ఇది పదివేల మందిలో ఒకరికి కన్పించవవచ్చు. మేనరికాలు చేసుకున్న వారిలో ప్రతి 12 మందిలో ఒకరిలో కనిపించవచ్చు.
మేనరికాల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు
- పుట్టుకతో అవయవ లోపాలు
- చెవుడు, మూగ, సెరిబ్రల్ పాల్సీ, ఆల్బినిజం, ఫోలింగ్‌వ్యాధి
- బుద్ధి మాంద్యం, ఆర్కిప్టనూరియా.
- ఎదుగుదల లోపాలు. శారీరక, మానసిక ఎదుగుదల లేకపోవడం.
- ఇన్‌హెరిట్డె బ్లడ్ డిస్ ఆర్డర్స్ ఉదా:హీనోఫీలియా.
- కారణం లేకుండా పుట్టే పిల్లలు చనిపోవడం (నియోటల్ ఇన్‌ఫాంట్ డెత్స్)
- ఎపిలెప్సీ ముఖ్యమైనవి కంటిలోపాలు, వినాళగ్రంథులలోపాలు
8.హైపర్‌టెన్షన్, కొరినరీ ఆర్టీరీ డిసీజెస్, డయాబెటిస్, రక్తహీనత. ఆటిజిమ్, స్క్రీజోఫ్రీనియ, కేన్సర్ వంటి కాంప్లెక్స్ డిస్ ఆర్డర్స్ వంశానుగతంగా వస్తాయి. దాదాపు బ్రిలియన్ మందిలో వంశానుగత వ్యాధులతో బాధపడుతున్నారు. వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు దగ్గర సంబంధీకుల్లో వివాహాలు చేసుకున్న వారే కావడం గమనార్హం.
వంశానుగత వ్యాధులు ఏ విధంగా కల్గుతాయి?
్పతి వీర్యకణంలో 22 ఆటోజోమ్స్, ఒక సెక్స్ క్రోమ్‌జోమ్ ఉన్నట్లే అండకణంలో 22 ఆటోజోమ్స్, ఒక సెక్స్ క్రోమోజోమ్ ఉంటుది. ఈ రెండు ఫలదీకరణం చెందినపుడు మొత్తం 44 ఆటోజోమ్స్, 2 సెక్స్ క్రోమోజోమ్స్ వల్ల ఆడ, మగ పిల్లలు పుట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో జ్రకోవో, జోమ్స్ అమరికలోని తేడా వల్ల తల్లిదండ్రులు, పూర్వీకుల గుణాలు, వ్యాధులు, పోలికలు పిల్లలకు సంక్రమిస్తాయి. ప్రతి వ్యక్తిలో ఒకే క్రోమోజోన్స రెండూ ఉంటాయి. కొన్ని
జీన్స్ రెండు క్రోమోజోమ్స్‌లో ఉండక ఒక దానిలోనే ఉండవచ్చు. అయితే ఒక క్రోమోజోమ్‌లోనే ఉండడం వల్ల వ్యాధి. బహిర్గతం కాకపోవచ్చు. దానివల్ల వారి పిల్లల్లో ఎటువంటి వ్యాధులు కనిపించకపోవచ్చు. మేనరికాలు చేసుకున్నవారిలో వ్యాధి కలిగి ఉన్న బీజకణం, వ్యాధిలేని బీజకణం మరొకరిది కలిసినపుడు పుట్టిన బిడ్డ వ్యాధి వాహకుడుగా ఉంటాడే కాని వ్యాధిగ్రస్థుడు మాత్రం కాడు. ఉదా: హీమోఫీలియా. ఒకే వ్యాధికి సంబంధించిన జీన్స్ ఇద్దరిలో ఉన్నట్లయితే వ్యాధులు వారి పిల్లలకు చిన్న వయసులోనే కలుతుగుతాయి. ఉదా: ధైరాయిడ్, డయాబెటీస్, కేన్సర్, ఆస్త్మా వ్యాధులు. అయితే మేనరికాలు చేసుకున్న వారందరిలో ఇలా జరగాలని లేదు. వారిలో వ్యాధిని కల్గించే రెసిసిన్ జీన్స్ ఉండాలని లేదు. ఇన్‌హరిటెడ్ జీన్స్ వల్ల వ్యాధి లేని బీజ అండ కణాలు కలయిక వల్ల వ్యాధులేర్పడవు.
ఒకే వ్యాధి ఉన్న రెసిసిల్ జీన్స్ రెండూ జత కూడా అవకాశాలే ఎక్కువ కాబట్టి మేనరికాల్లో, రక్త సంబంధీకుల్లో వివాహాలు చేసుకున్నప్పుడు పిల్లల్లో జెనిటిక్‌గా వంశానుగుతంగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
- డాక్టర్. కె.ఉమాదేవి, తిరుపతి
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/