సైన్యంలో చేరాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను కానీ..ః రాజ్ నాథ్ సింగ్‌

ఆ సమయంలో నాన్న చనిపోవడంతో చేరలేకపోయానని వెల్లడి

Wanted to join the Army, but couldn’t: Rajnath Singh

న్యూఢిల్లీః రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి ఇన్స్ పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ (సౌత్) ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అస్సాం రైఫిల్స్, రెడ్ షీల్డ్ డివిజన్ బృందాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ… ఆయన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నానని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా సైన్యంలో చేరలేకపోయానని చెప్పారు. ఆర్మీలో చేరేందుకు సన్నద్ధమయ్యానని… షార్ట్ సర్వీస్ కమిషన్ కు ఒకసారి దరఖాస్తు కూడా చేసుకున్నానని… అయితే ఆ సమయంలో తన తండ్రి మరణించడంతో సైన్యంలో చేరలేకపోయానని తెలిపారు.

తాజాగా ఈ విషయాన్ని చెపుతూ రాజ్ నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆర్మీ యూనిఫామ్ లో ఒక ఛరిష్మా ఉంటుందని చెప్పారు. సైనిక దుస్తులను చిన్న పిల్లాడికి ఇచ్చినా అతనిలో ఒక ఛరిష్మా కనిపిస్తుందని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/