కొవ్వును తగ్గించాలంటే..
ఆహారం-ఆరోగ్యం

ఈ కాలం అమ్మాయిలను వేధిస్తోన్న ముఖ్యమైన సమస్య ‘బెల్లీ ఫ్యాట్’ దీన్నితగ్గించుకోవడానికి కన్నా కవర్ చేసుకోవడానికే ఎక్కువ తంటాలు పడుతూ ఉంటారు. ఎక్కువగా తినడం లేదా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది.
అయితే పైసా ఖర్చులేకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును సులువుగా కరిగించేయొచ్చు. ఇంట్లోనే ఎంతో సులువైన పవనముక్తాసనం వేశారంటే సరిపోతుంది. పవనం అంటే గాలి, ముక్త అంటే తొలగించడం. పేగుల్లో పేరుకుపోయిన అపాన వాయువును తొలగిస్తుంది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఆసనాన్ని ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయవచ్చు.

ఎలా చేయాలి?
- ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి.
- -దీర్ఘంగా శ్వాస పీల్చుకోవాలి.
- మోకాళ్లను రెండు చేతులతో పట్టుకుని చాతీ వరకు తీసుకురావాలి. మోకాలితో పొట్టను అదుముతూ శ్వాసను వదులుతూ చుబుకాన్ని మోకాళ్లను తాకించాలి.
ఈ స్థితిలో కొద్దిసేపటి వరకు ఉంటూ గాఢ ఉఛ్వాస, నిఛ్చ్వాసలను తీసుకోవాలి. - అనంతరం తిరిగి యధాస్థితికి వచ్చేయాలి.
- దీన్ని రెండు, మూడుసార్లు చేయాలి.
ఉపయోగాలు
- కండరాలను బలపర్చడంతో పాటు బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది.
- జీర్ణక్రియను మెరుగుపరుస్తూ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
- పేగులు, ఇతర ఉదర అవయవాలకు మసాజ్ చేస్తుంది.
- కీళ్లలో రక్తప్రసరణను మెరుగుపర్చుతుంది.
- అధిక బరువును తగ్గిస్తుంది
- గ్యాస్ బయటకు వెళ్లిపోతుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/