యనమల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స

తాను ఏ ఎమ్మెల్సీకి ఫోన్‌ చేశానో దమ్ముంటే యనమల నిరూపించాలని బొత్స సవాల్‌

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: ఈ రోజు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఇవాళ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్సీలకు మంత్రి బొత్స సత్యనారయణ ఫోన్‌ చేసి ప్రలోభాలకు గురిచేశారని టిడిపి సినీయర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. దీంతో యనమల వ్యాఖ్యలపై బొత్స సత్యనారయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ ఎమ్మెల్సీకి ఫోన్‌ చేశానో యనమలకు దమ్ముంటే నిరూపించాలని ఆయన సవాల్‌ విసిరారు. ఇదే సమయంలో శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌పై కూడా మంత్రి బొత్స పైరయ్యారు. టిడిపి సభ్యుడిలా షరీఫ్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మండలి చైర్మన్‌ పనితీరు ఓ మచ్చగా మిగిలిపోతుందని అన్నారు. పార్టీలకు అతీతంగా మండలి చైర్మన్‌ వ్యవహరించాలని, తనకు ఉన్న అధికారాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవద్దని బొత్స సూచించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/