ఆస్ట్రేలియాలో వడగండ్ల వాన

బంతి సైజులో వడగళ్లు

Huge hail batters
Huge hail batters

సిడ్నీ : వరుస కార్చిచ్చులు, వరదలతో విలవిలలాడిన ఆస్ట్రేలియా ప్రజలు ఇప్పుడు మరో రెండు ప్రకృతి ప్రకోపాలను చవిచూస్తున్నారు. వడగండ్ల వాన, ఇసుక తుఫానులు ఆస్ట్రేలియాను అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని కాన్‌బెర్రాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. గోల్ఫ్‌ బంతి పరిమాణంలో పార్లమెంటు భవనంపై వడగండ్లు పడినట్టు అధికారులు తెలిపారు. భారీస్థాయిలో మంచుగోళాలు పడిన కారణంగా పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. వెయ్యికి పైగా ఇండ్లలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. న్యూ సౌత్‌వేల్స్‌లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 107 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో డబ్బో నగరాన్ని తుఫాను కమ్మేసింది. గాలుల తీవ్రత కారణంగా ఓ పాఠశాల నేలమట్టమైంది. ఇసుక తుఫాను కారణంగా బ్రోకెన్‌ హిల్‌, నిన్గాన్‌, పారక్స్‌ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని స్థానిక మీడియా పేర్కొంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/