బొత్స ఝాన్సీ విజయం ఖాయం అంటున్న పార్టీ శ్రేణులు

మరో నెల రోజుల్లో ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి విజయం ఎవర్ని వరిస్తుందో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తూ..తమ తమ అభ్యర్థుల విజయం ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ విజయం ఫై పార్టీ శ్రేణులు , పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలు ధీమా వ్యక్తం చేస్తూ..ఆమె చేసిన సేవలు, రాష్ట్రం కోసం పార్లమెంట్ సాక్షిగా ఆమె పాల్గొన్న డిబేట్ల గురించి మాట్లాడుకుంటున్నారు.

జూన్ 2009 నుంచి ఫిబ్రవరి 2014 వరకు 5 ఏళ్ల కాలంలో పార్లమెంటు సమావేశాలకు 88 శాతం హాజరైన అతికొద్ది మంది ఎంపీల్లో ఒకరుగా బొత్సా ఝాన్సీ నిలిచారు. ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం 146 డిబేట్స్ లో ఆమె పాల్గొన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలఫై ఆమె తన గళం విప్పారు. ఇవి కాకుండా దేశ బడ్జెట్ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులపై చర్చించారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సమస్యలు, అక్కడికి కావల్సిన నిధులను ప్రస్తావించారని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. ఇలా నిత్యం ప్రజల సమస్యల ఫై గళం విప్పిందని..అలాంటి ఆమెను మరోసారి గెలిపించుకొని పార్లమెంట్ లో నిలబెడతాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.