పవన్‌ కళ్యాణ్‌ ను తన్నీ తరిమేయాలి అంటూ ముద్రగడ పిలుపు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేసారు. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ ను తన్నీ తరిమేయాలి… అలా చేస్తే సినిమా నటులు ఇక రాజకీయాల్లోకి రారని ముద్రగడ పిలుపునిచ్చారు. సీఎం జగన్ దృష్టిలో 175 నియోజకవర్గాలలో పిఠాపురం నెంబర్1 గా ఉండాలని అనుకుంటున్నాను….సీఎంకు పిఠాపురం నెంబర్ వన్ అయితే పులివెందుల నెంబర్ 2 అని వెల్లడించారు.

షూటింగ్ లు చేయడానికి ఎమ్మెల్యే పదవి కావాలా అంటూ నిలదీశారు. కష్టం వస్తే షూటింగ్ లకు వచ్చి చెప్పాలా…. ముఖానికి రంగు వేసుకుని తైతిక్కలాడుతూ ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ పై నిప్పులు చెరిగారు. పెద్దలు… పిల్లల్ని కంట్రోల్ లో పెట్టాలని.. 2,30,000 ఓట్లు ఉంటే మూడు లక్షలు మెజారిటీ తో గెలుస్తానంటున్నాడని చురకలు అంటించారు.