దక్షిణకొరియాపై కొవిడ్‌-19 ఎఫ్‌క్ట్‌

ఒక్క రోజులోనే 300 కొత్త కేసుల నమోదు

covid-19
covid-19

దక్షిణకొరియా: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19)ఇప్పుడు దక్షిణకొరియాపై పంజా విసురుతోంది. ఒక్క రోజులోనే ఆ దేశంలో కరోనా కేసులు ఏకంగా 300 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణకొరియాలో ఇప్పటి వరకు 1,261 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనా వెలుపల అత్యధిక స్థాయిలో కరోనా కేసులు దక్షిణకొరియాలోనే నమోదు కావడం గమనార్హం. మరోవైపు, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న డ్యూగూ నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున మందులు, రక్షణ పరికరాలను సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణకొరియా ప్రధాని చుంగ్ సె క్యున్ మాట్లాడుతూ, కరోనా వైరస్ పై పోరాటంలో ఈ వారం అత్యంత కీలకమైనదని చెప్పారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/