ప్రజల సొమ్మును దోచుకుంది కాక మోత మోగించాలని అడుగుతున్నారా? : బొత్స

మోత మోగిద్దాం కార్యక్రమానికి పిలపునిచ్చిన టిడిపి

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతిః ఈ రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ‘మోత మోగిద్దాం’ కార్యక్రమానికి టిడిపి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్యాలస్ లో ఉన్న సీఎం జగన్ కు వినిపించేలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మోత మోగించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్స్ వేదికగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. బాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నాడు కాపులు కంచాలు మోగిస్తే ఇదే చంద్రబాబు కేసులు పెట్టి వేధించారని, కాపు ఆడపడుచులను సైతం దూషించి అవమానాలకు గురి చేశారని విమర్శించారు. అవినీతికి పాల్పడి ఆధారాలతో సహా దొరికిపోయిన బాబు కోసం ఈరోజు ప్రజలు కంచాలు మోగించాలా? అని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దోచుకుంది కాక… మళ్లీ ప్రజలనే తన కోసం మోతలు మోగించాలని అడగడానికి నోరెలా వస్తోందని ప్రశ్నించారు.