మహేష్ కు విలన్ గా అమిర్ ఖాన్..?

బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమిర్ ఖాన్..మహేష్ బాబు కు విలన్ గా నటించబోతున్నాడనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం మూవీ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత ఆర్ఆర్ఆర్ ఫేమ్ రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమా లో విలన్ గా అమిర్ ఖాన్ ను రాజమౌళి ఎంపిక చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ వార్తపై అటు రాజమౌళి టీం నుండి కానీ ఇటు అమీర్ ఖాన్ నుండి ఎటువంటి ప్రకటన లేదు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

ఇక అమిర్..ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ లో రావణ పాత్ర లో కనిపించబోతున్నాడు. ఓం డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.