జగన్ సర్కార్ ఫై బొండా ఉమ ఫైర్

ప్రపంచ ప్రఖ్యాత దావోస్ లో అనేక రాష్ట్రాలు పాల్గొని పెట్టుబడుల కోసం ట్రై చేస్తుంటే..ఏపీ సర్కార్ మాత్రం దావోస్ కు వెళ్లకుండా ఇక్కడ కాలక్షేపం చేస్తుందని , తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ లో పెట్టుబడులను ఆకర్షిస్తుంటే..మన ఏపీ ఐటీ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడని మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఉమా మాట్లాడుతూ..చంద్రబాబు హయాంలో రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా, పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా ఉండేది. దావోస్ వేదిక మొదలు, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్ని, పెట్టుబడిదారుల్ని ఆకర్షించడానికి చంద్రబాబు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక, పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.

చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వంతో పారిశ్రామికవేత్తలు చేసుకున్న రూ.16 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాల్ని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే దుర్మార్గంగా రద్దు చేశాడు. జగన్ అహంకారపూరిత నిర్ణయం, ప్రతి పారిశ్రామికవేత్తలను ఆలోచించుకునేలా చేసింది. దానిప్రభావమే నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్కపరిశ్రమ రాకపోవడం’ అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్ లో పెట్టుబడులను ఆకర్షిస్తుంటే… ఏపీ మంత్రి విశాఖలో కోడిపందేలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పైసా పెట్టుబడి తీసుకురావాలన్న ఆలోచన, పది మందికి ఉపాధి కల్పించాలన్న సద్భుద్ధి జగన్ కి, ఆయన ప్రభుత్వానికి లేదని బొండా ఉమా విమర్శించారు. దావోస్ సదస్సులో ఏపీ ప్రాతినిధ్యం ఎందుకు లేదో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.