ధనుష్ ‘సార్’ నుంచి బంజారా సాంగ్ రిలీజ్..

ధనుష్ హీరోగా నటిస్తున్న సార్ మూవీ నుండి బంజారా సాంగ్ ను విడుదల చేసారు మేకర్స్. తెలుగు లో ‘సార్‌’ / ‘వాతి’ (తమిళం) గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై యువ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు.

రెండు భాషల్లోను ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘బంజారా’ అనే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఇల్లేనాదని .. వాకిలి నాదేనంటే ఫక్కున నవ్వుతాది భూ తల్లి’ అంటూ ఈ పాట మొదలవుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం తో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ధనుష్ ఒక ఉపాధ్యాయుడిగా కనిపించబోతున్నాడు.

YouTube video