చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం

పెరిగిన సంక్రాంతి రద్దీ

Heavy traffic jam at Patangi Toll Plaza
Heavy traffic jam at Patangi Toll Plaza

Hyderabad: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లలో పండుగ జరుపుకునేందుకు  చాలా మంది సొంత వాహనాల్లో బయలుదేరారు. శివార్లలో ఆర్టీఎ అధికారులు వాహనాల తనిఖీలు మొదలు పెట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

సంకాంతి కారణంగా నగర ప్రజలు అంతా గ్రామాలబాట పట్టారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కారణంగా పతంగి టోల్‌గేట్‌ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. 

చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా   ట్రాఫిక్ జాం అయింది. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రా ప్రాంత వాసులు మొత్తం ఈ టోల్‌గేట్‌ విూదుగానే వెళ్లాలి. దీంతో రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. పండుగకు సొంత ఊళ్ళకు పెద్దఎత్తున సొంత వాహనాల్లో తరలివెళుతున్నారు.

దీంతో టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్ అయింది.  సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు జిల్లాలకు వెళ్లినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

తగిన విధంగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/