శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేయడం కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు.. విమానాశ్రయ అధికారులకు మెసేజ్‌ పెట్టాడు. దీంతో.. అధికారులు ఎయిర్‌పోర్టును తమ స్వాధీనంలోకి తీసుకుని.. హై అలర్ట్‌ ప్రకటించారు. బాంబ్‌ స్వ్కాడ్‌‌తో అణువణువూ తనిఖీలు మొదలుపెట్టారు. ఈ నంబర్ ట్రేస్ చేసి పోలీసులు… కాచిగూడకు చెందిన వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించారు.

ఆదివారం (జనవరి 21న) రాత్రి సరిగ్గా 7 గంటల 55‌ నిమిషాల‌కు ఎయిర్‌పోర్టులోని మొయిన్‌టెనెన్స్ కస్టమర్ కేర్ నెంబర్‌కు.. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్టుగా ఫోన్ చేసాడు. ఊహించని పరిణామంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే.. ఎవరూ కంగారుపడొద్దని.. భయపడాల్సిన అవసరం లేదని ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రయాణికులకు నచ్చజెప్పారు. తర్వాత ఆ కాల్ ఫేక్ కాల్ గా గుర్తించారు.