కరోనా పాజిటివ్ వచ్చిందని ఆత్మహత్య

ఇంట్లో ఉరేసుకున్న ఓ వ్యక్తి

Suicide that the corona got positive
suicide

Hyderabad: ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలిన ఓ వ్యక్తి నేరేడ్‌మెట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఆ భయంతో అతను తన ఇంట్లోనే సీలింగ్‌ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. జనవరి 14న వచ్చిన మెడికల్ రిపోర్టులో ఇక కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచి హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఆదివారం భార్య, ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. వారు తిరిగి వచ్చే టప్పటికి , అతను ఉరి వేసుకున్నాడు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/