వైసీపీ మంత్రి జయరాం ఎక్కడ..?

ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం ఎక్కడ అంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా వైసీపీ లో సర్వేల ఆధారంగా నియోజకవర్గ ఇంచార్జ్ ల మార్పు..సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ నిరాకరణ వంటివి జరుగుతున్నాయి. దీంతో టికెట్ రాని నేతలంతా అధిష్టానం ఫై కోపం తో పార్టీ కి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు బయటకు రాగా..మరికొంతమంది రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.

తాజాగా తన నియోజకవర్గం మార్చడంతో ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఆలూరు నుంచి తప్పించి కర్నూలు ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది వైసీపీ. ఆలూరు ఇన్‌చార్జ్‌గా జయరాం వ్యతిరేక వర్గానికి చెందిన జడ్పీటీసీ విరుపాక్షను ప్రకటించింది. దాంతో మంత్రి తీవ్ర అసంత‌ప్తితో ఉన్నారంటున్నారు.

ఆ క్రమంలో జయరాం కొన్ని రోజులుగా పలువురి ఫోన్లకు స్పందించడం లేదట. తన రాకపోకలనూ గోప్యంగా ఉంచుతున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి నిజంగా జయరాం పార్టీ మారుతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.