సన్నీ లియోనీ ఫ్యాషన్ షో సమీపంలో బాంబ్ బ్లాస్ట్

మణిపుర్​ రాజధాని ఇంఫాల్ లో బాంబు బ్లాస్ట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ హాజరు కావాల్సిన ఓ ఫ్యాషన్​ షో వేదిక సమీపంలో ఈ బాంబ్ బ్లాస్ట్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శనివారం ఉదయం ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో నగరంలోని ప్రజలు ఒక్కసారిగా భయందోళనలనకు గురయ్యారు.

పోలిసుల వివరాల ప్రకారం ..హప్తా కాంగ్జేబుంగ్ ప్రాంతంలో జరుగుతున్న ఫ్యాషన్​ షో ప్రాంగణానికి 100 మీటర్ల దూరంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎవ్వరికి గాయాలు కాలేదని ఇంఫాల్ ఈస్ట్​ ఎస్పీ మహారాబం ప్రదీప్ సింగ్ తెలిపారు. పేలుడుకు చైనీస్​ గ్రెనేడ్​ను వినియోగించినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదని ప్రదీప్ సింగ్ వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.