త్వరలో హైదరాబాద్ నుంచి కొత్త టీకా

బయోలాజికల్‌ – ఇ కంపెనీ వెల్లడి

Biological - e Company Revealed
Biological – e Company
  • 3వ దశ ట్రయల్స్‌ అనంతరం ఆగస్టు నుంచి ఉత్పత్తి ప్రారంభం
  • క్లినికల్‌ ట్రయల్స్‌ కు డ్రగ్‌ రెగ్యులేటర్‌ నుంచి అనుమతి
  • హూస్టన్‌లోని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌, డైనవాస్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌తో కలిసి ఉత్పత్తి

Hyderabad: హైదరాబాద్‌లోని బయోలాజికల్‌ – ఇ కంపెనీ నుంచి త్వరలో కొత్త టీకా అందుబాటులోకి రానుంది . 3వ దశ ట్రయల్స్‌ ప్రారంభించి ఆగస్టు నుంచి వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయనుందని తెలిసింది. ఆగస్టు నుంచి నెలకు 75 మిలియన్ల నుంచి 80 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ఎండీ మహిమా దాట్ల వెల్లడించారు. హూస్టన్‌లోని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌, డైనవాస్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌తో బయోలాజికల్‌ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయనుంది.

గత నెలాఖరులో 3వ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కు డ్రగ్‌ రెగ్యులేటర్‌ నుంచి అనుమతి పొందింది. గతేడాది నవంబర్‌ లోనే బయోలాజికల్‌ కరోనా వ్యాక్సిన్‌ తొలి, రెండవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టింది. మొత్తం 360 మంది ఆరోగ్య వంతులైన వాలంటీర్లపై ప్రయోగాలు జరిపినట్లు సంస్థ పేర్కొంది.
ఇక మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ దేశంలోని 15 ప్రాంతాల్లోచేపట్టనుంది. టీకా ట్రయల్స్‌ సురక్షితమైనవి, సమర్ధవంతమైనవిగా తేలినట్లు ఆ సంస్థ పేర్కొంది. . ఈ టీకా అందుబా టులోకి వస్తే పేద, మధ్య తరగతి దేశాలకు పెద్ద ఊరట లభిస్తుందని టెక్సాస్‌ మెడికల్‌ కాలేజీ అసోసియేటెడ్‌ డీన్‌ తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/