కురులతోనే ఇనుమడించే అందం.. బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ హబీబ్ అహ్మద్

Bollywood hair stylist Habib Ahmed is the beauty that irons with Kurus

కురులతో నే వ్యక్తుల అందం ఇనుమడిస్తుంది అని బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ హబీబ్ అహ్మద్ తెలిపారు. యువతి, యువకులకు కేశ సంరక్షణ పై దృష్టిని కేంద్రీకరించాలి సూచించారు. ఆదివారం నగరం లో ని కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ లో హాబీబ్ హెయిర్ & బ్యూటీ సెలూన్ ను టాలీవుడ్ నటి వెద్విక సోనీ, హబిబ్ అహ్మద్, అమన్ అహ్మద్, శ్రుతి లడ్డా తో కలిసి ప్రారంభించిన అనంతరం కేశ సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. పౌష్ఠిక ఆహారం, సరైన నిద్ర, విశ్రాంత జీవనం, మానసిక ఆనందం, శారీరక వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి కురుల పై ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. తద్వారా నడి వయసు లో కేశాలు పటిష్టం గా వుంటాయి అన్నారు. తాము కురులు సంరక్షణ కు నాణ్యమైన సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు.

సినీ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలు శరీరాకృతి, శిరోజాల సంరక్షణ విషయంలో రాజీపడరని వర్థమాన కథానాయిక వేద్వికా సోని అన్నారు. ఈ సందర్భంగా అందం కోసం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సౌకర్యాలను ఆమె అడిగి తెలుసుకుంటూ….. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. బ్యూటీకి హైదరాబాద్‌ కేరాప్‌ అడ్రస్‌గా మారిందని హబీబ్స్‌ హెయిర్‌ అండ్‌ బ్యూటీ వ్యవస్థాపకులు అమన్ హబీబ్‌ అన్నారు. నగరానికి రావడం చాలా సంతోషంగా ఉందని…గతంలో కంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.