రూ.200 కోట్ల వరకు సెక్యూర్డ్ , రీడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDలు) పబ్లిక్ ఇష్యూను ప్రారంభించిన ఇండెల్ మనీ లిమిటెడ్

Indel Money Limited launches public issue of secured, redeemable non-convertible debentures (NCDs) of up to Rs.200 crore

.ఒక్కొక్కటి రూ.1,000 ముఖ విలువ కలిగిన సెక్యూర్డ్ NCD లు జారీ చేయనున్నారు

.ఈ ఇష్యూ యొక్క బేస్ ఇష్యూ పరిమాణం మొత్తం రూ.100 కోట్ల గా ఉంటుంది , దీనితో రూ. 100 కోట్లు వరకూ ఓవర్ సబ్స్క్రిప్షన్ చేసుకునే అవకాశం వుంది. తద్వారా మొత్తం ఇష్యూ పరిమాణం రూ.200 కోట్లు వరకూ చేరుకోవచ్చు.

.ఈ ఇష్యూ జనవరి 30, 2024న మంగళవారం తెరవబడుతుంది మరియు ఫిబ్రవరి 12, 2024 సోమవారం ముగుస్తుంది

.72 నెలల్లో పెట్టుబడి రెట్టింపు – ఆప్షన్ VIII

.సంవత్సరానికి 12.25% వరకు కూపన్ రాబడి ఉంటుంది

.సెక్యూర్డ్ NCDల కాల వ్యవధి 366 రోజుల నుండి 72 నెలల వరకు వుంటుంది

.కనీస అప్లికేషన్ పరిమాణం 10 NCDలు (రూ.10,000). NCDల యొక్క అన్ని ఆప్షన్ లో ఇది ఉంటుంది

హైదరాబాద్: గోల్డ్ లోన్ సెక్టార్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎన్‌బిఎఫ్‌సిలలో ఒకటైన ఇండెల్ మనీ లిమిటెడ్, రూ.1,000 ముఖ విలువ కలిగిన సెక్యూర్డ్ ఎన్‌సిడిల 4వ పబ్లిక్ ఇష్యూను ప్రకటించింది. ఈ ఇష్యూ ఈరోజు, అంటే జనవరి 30, 2024న తెరవబడుతుంది మరియు ఫిబ్రవరి 12, 2024 సోమవారం నాడు ముగుస్తుంది (సబ్‌స్క్రిప్షన్‌ను త్వరగా ముగించే పక్షంలో ముందస్తుగా మూసివేసే ఎంపికతో).

ఇండల్ మనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీ ఉమేష్ మోహనన్ మాట్లాడుతూ, “గోల్డ్ లోన్ పరిశ్రమలో మా స్థానాన్ని మెరుగుపరచుకోవడానికి మరియు మా కార్యకలాపాలను విస్తరించడానికి, మా పోటీతత్వ బలాలను ఉపయోగించుకోవడానికి మా వ్యాపార వ్యూహం రూపొందించబడింది. ఆర్థిక సంవత్సరం 2024 మొదటి అర్ధభాగంలో కంపెనీ లాభదాయకత రికార్డు స్థాయిలో 568.86% పెరగడం, బలమైన ఏయుఎం

వృద్ధి, గోల్డ్ లోన్‌ల కోసం పెరిగిన డిమాండ్, సవాలుతో కూడిన వ్యాపార వాతావరణం ఉన్నప్పటికీ కొత్త ప్రాంతాలకు విస్తరణ మరియు కార్యాచరణ సామర్థ్యాల కారణంగా అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. కొత్త బ్రాంచ్‌లను తెరవడం ద్వారా మా బ్రాంచ్ నెట్‌వర్క్‌ని విస్తరించడం , మా లోన్ పోర్ట్‌ఫోలియోను వృద్ధి చేయడం కొనసాగించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. పెరిగిన రాబడి, లాభదాయకత మరియు విజిబిలిటీ బ్రాంచ్ నెట్‌వర్క్‌ను నడిపించే అంశాలు. ఈ ఇష్యూ తో, మేము మా నిధుల వనరులను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము…” అని అన్నారు.

ఇష్యూలో రూ.100 కోట్ల మొత్తానికి బేస్ ఇష్యూ సైజు ఉంటుంది, అలాగే రూ.100 కోట్ల వరకు ఓవర్-సబ్‌స్క్రిప్షన్‌ తో మొత్తం రూ.200 కోట్ల వరకు ఇష్యూ వుండే అవకాశం ఉంది. ఇష్యూకి లీడ్ మేనేజర్ వివ్రో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.

ఈ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులు, తదుపరి రుణాలు, ఫైనాన్సింగ్ మరియు కంపెనీ యొక్క రుణాలపై అసలు మరియు వడ్డీని తిరిగి చెల్లించడం/ముందస్తు చెల్లింపు కోసం ఉపయోగించబడతాయి.

మార్చి 31, 2023 నాటికి ఉన్న రూ.64,768.53 లక్షలతో పోలిస్తే సెప్టెంబర్ 30, 2023 నాటికి ఇండెల్ మనీ లిమిటెడ్ మొత్తం బకాయి AUM (ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఆస్తులు మినహా) రూ.81,740.86 లక్షలుగా ఉంది. రుణ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ లోన్‌లు 82% వరకూ ఉంటాయి. సెప్టెంబర్ 30, 2023 నాటికి 250 బ్రాంచ్‌ల బ్రాంచ్ నెట్‌వర్క్‌ వుంది. ఇండల్ మనీ లిమిటెడ్ 2025 ఆర్థిక సంవత్సరం నాటికి తమ కార్యకలాపాలను 12 భారతీయ రాష్ట్రాల్లోని 425 శాఖలకు విస్తరించాలని భావిస్తోంది, భారతదేశంలోని తూర్పు మరియు ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరించనుంది.

ఇండెల్ మనీ లిమిటెడ్ గతంలో NCDల 3 పబ్లిక్ ఇష్యూలను చేసింది మరియు రూ.260 కోట్లకు పైగా సేకరించింది.