నాళాల్లో కొట్టుకువచ్చిన రెండు మృత దేహాలు..

మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిలా ఉండేది..కానీ నిన్న సడెన్ గా చల్లబడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ముఖ్యముగా హైదరాబాద్ గంటపాటు దంచికొట్టిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం తో ప్రయాణికులు , వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాల చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. పలు కరెంట్ వైర్లు తిగిపడడంతో విద్యుత్తూకు అంతరాయం ఏర్పడింది. ఇక ఎప్పటిలాగానే నాళాలు నోరు తెరుచుకోవడం తో ఇద్దరు అందులో పడి చనిపోయారు.

బేగంపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. భారీ వర్షానికి ఓల్డ్ కస్టమ్స్ బస్తి నాళాల్లో రెండు మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. ఆ ఇద్దరు నాళాలో పడి మరణించినట్లు సమాచారం. వీరి ఎవరు..ఎక్కడి వారు అనేది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అలాగే దూద్‌బౌలికి చెందిన ఫక్రు(40) మంగళవారం బహదూర్‌పురాలో వరదలు ఉన్న రోడ్డు దాటుతున్నప్పుడు విద్యుత్ స్తంభానికి తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మద్యం తాగి పడిపోయాడని అనుకున్న స్థానికులు పట్టించుకోలేదు, కానీ ఎంత సేపటికి కదలకపోవటంతో పోలీసులకు సమాచారం అందించగా….పోలీసులు వచ్చి చూసే సరికి ఫక్రు మృతి చెంది ఉన్నాడు. కరెంట్ స్థంభం షాక్ తో మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.