ఐపీఎల్ ఫైనల్స్ లోకి ఢిల్లీ క్యాపిటల్స్

చరిత్రలో తొలిసారి

ipl-2020-Delhi Capitals into IPL final
ipl-2020-Delhi Capitals into IPL final

అబుదాబి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుత విజయంతో ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది.

మంగళవారం తుది సమరంలో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ తలపడనుంది. 190 పరుగుల భారీ లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది.

దీంతో ఢిల్లీ 17 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫాస్ట్‌ బౌలర్‌ రబాడ(4/29), స్టాయినీస్‌(3/26) ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

కేన్‌ విలియమ్సన్‌(67: 45 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) ఒంటరి పోరాటం వృథా అయింది. యువ బ్యాట్స్‌మన్‌ అబ్దుల్‌ సమద్‌(33: 16 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) కళ్లుచెదిరే షాట్లతో అలరించాడు.

తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(78: 50 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత అర్ధశతకంతో విజృంభించాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/