ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రాష్ట్ర డిస్కంలు

ఏపీ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు తెలిపాయి డిస్కంలు(SPDCL, CPDCL, EPDCL). రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున వినియోగదారులు, పరిశ్రమలకు ఈ ఏడాదీ పాత టారిఫ్ కొనసాగించనున్నట్లు..ఎలాంటి చార్జీలు పెరగవని వెల్లడించాయి. రైల్వేకు అందిస్తున్న విద్యుత్ ఛార్జీలపై యూనిట్కు రూ.1, గ్రీన్ పవర్ కేటగిరీలో 75 పైసల నుంచి రూపాయికి పెంచేందుకు అనుమతివ్వాలని ఏపీఈఆర్సీని కోరాయి.

వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కరెంట్ చార్జీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. గృహాలతో పాటు పరిశ్రమలకు ఇలా అన్నింటికి యూనిట్ ధర తో పాటు ఆ ఛార్జి లు , ఈ ఛార్జ్ అంటూ భారీగా పెంచేశారు. ఈ పెరుగుదలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇప్పుడు సమ్మర్ వస్తుండడం తో చార్జీలు ఏమైనా పెంచుతారా అని ఎదురుచూస్తున్న సమయంలో కాస్త ఊరట కలిగించే వార్త తెలిపి హమ్మయ్య అనిపించాయి డిస్కం లు.