సింగరేణి సంస్థ మూసివేతకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు

సింగరేణిని ప్రైవేటీకరించవద్దని కేంద్రానికి కేసీఆర్ ఎన్నోసార్లు విన్నవించారన్న కవిత

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తెలంగాణకు గర్వకారణంగా ఉన్న సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సింగరేణి బొగ్గు గని కార్మికులు వారి స్వేదంతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతున్నారని చెప్పారు.

సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉందని… అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతిని సాధించిందని… దేశంలోని ఇతర సంస్థల కంటే ఎక్కువ లాభాలను సాధించిందని చెప్పారు. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి కేసీఆర్ ఎన్నోసార్లు విన్నవించారని… అయితే కేంద్రం నిరంకుశంగా ముందుకు సాగుతోందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/