ముచ్చింతల్‌లో రెండో రోజు రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు

హైదరాబాద్: ముచ్చింతల్‌ దివ్యక్షేత్రం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు, అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 12 రోజుల ఈ మహాక్రతువులో తొలిరోజు శోభాయమానంగా జరిగింది. రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా అగ్నిమథనం పూర్తి అయింది. రెండో రోజు శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువులో భాగంగా శమి, రావి కర్రలతో అగ్ని మథనం చేశారు.

తర్వాత అగ్నిహోత్రంతో 1035 కుండలాల్లో హోమం చేయనున్న రుత్వికులు.. ఇందుకోసం యజ్ఞ కుండలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఏకకాలంలో 5 వేల మంది రుత్వికులతో 1035 కుండలాల్లో హోమాలు నిర్వహిస్తారు. ప్రవచన శాలలో వేద పండితులచే ప్రవచన పారాయణం ఉంటుంది. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. కరోనా నిబంధనలు అమలవుతున్నాయో లేదో చూశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/