కరోనా వల్ల నాముఖాన్ని చాలా మిస్సవుతున్నా

కరోనా విజృంభణ వల్ల జాగ్రత్తలు తీసుకుంటున్నానన్న ట్రంప్

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాపించకుండా తీసుకొంటున్న చర్యలపై శ్వేతసౌధంలో తమ అధికారులతో ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. కరోనా విజృంభణ వల్ల తీసుకుంటున్న జాగ్రత్తల్లో భాగంగా తాను కొన్ని వారాలుగా తన ముఖాన్ని తాకలేదని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, కరోనా విజృంభణపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా స్పందిస్తూ ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలంతా ముందు జాగ్రత్త చర్యగా చేతులను శుభ్రం చేసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. ప్రజలు మాస్కులను ధరించవద్దని, వాటి కొరత ఉన్న కారణంగా వాటిని వైద్య సిబ్బంది కోసం ఆదా చేయాలని తెలిపారు. వైద్యుల సలహాలు పాటించాలని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/