తెలంగాణ వస్తేనే కొలువులు వస్తాయన్నారు

ఈ ఆరేళ్ల టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో 20 వేలకు మించి ఉద్యోగాలు కల్పించలేదు

K. Laxman
K. Laxman

హైదరాబాద్‌: తెలంగాణ వస్తేనే యువతకు కొలువులు వస్తాయని చెప్పిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ఆరేళ్ల పాలనలో 20వేలకు మించి ఉద్యోగాలు కల్పించలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. వాటిలో 50 శాతానికిపైగా పోలీసు ఉద్యోగాలే ఉన్నాయని..అవి కూడా అధికార పార్టీ నేతల రక్షణ కోసమే అన్నారు. హైదరాబాద్‌లోని బిజెపి కార్యలయంలో ఈ రోజు లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని చెప్పిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చిందో చెప్పాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలీటీలకు కేంద్ర ప్రభుత్వం రూ.1030 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయకుండా ఏరకమైన అభివృద్ధికి పాటుపడుతుందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ మాదిరిగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఏ మేరకు వాటిని నెరవేర్చారో కేటిఆర్‌ సమధానం చెప్పాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/