ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా శైలజనాథ్‌

తులసి రెడ్డి, షేక్‌ మస్తాన్‌ వలీలను వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియామకం

dr sake sailajanath
dr sake sailajanath

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ ప్రెసిడెంట్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లను కాంగ్రెస్‌ ఛీఫ్‌ సోనియా గాంధీ నియమించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలయిన విషయం తెలిసిందే. దీనికి బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆ పదవికి అప్పట్లో రాజీనామా చేశారు. దీంతో పాటు గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సినీయర్‌ నేత సాకే శైలజనాథ్‌ను పీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించారు. తులసి రెడ్డి, షేక్‌ మస్తాన్‌ వలీలను వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/