రజనీకాంత్‌ మద్దతే కోరుతాం..బిజెపి

మోడి, రజనీ మధ్య ఉన్న ఆత్మీయత గురించి ప్రజలందరికీ తెలుసు..సీటీ రవి

bjp-says-it-may-seek-rajinikanth-support-for-tamil-nadu-elections-in-2021

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలోనే, తాము రజనీకాంత్ మద్దతును కోరుతామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ప్రకటించారు. ప్రధాని మోడి, రజనీకాంత్ మధ్య ఉన్న ఆత్మీయత గురించి ప్రజలందరికీ తెలుసని తెలిపారు. తమిళనాడులో కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని రజనీని అడుగుతామని చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న సంకీర్ణంలో అన్నాడీఎంకే అతి పెద్ద పార్టీ అని ఆయన చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థే తదుపరి సీఎం అవుతారని స్పష్టం చేశారు. మరోవైపు, బిజెపితో మిత్రత్వాన్ని కొనసాగిస్తోన్న అన్నాడీఎంకే కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/