2020 మనకు ఆరోగ్య సంపద అంటే ఏమిటో నేర్పింది

గుజరాత్‌లోని ఎయిమ్స్‌ రాజ్‌కోటకు పునాదిరాయి వేసిని ప్రధాని

YouTube video
PM Shri Narendra Modi lays foundation stone of AIIMS Rajkot, Gujarat

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి గుజరాత్‌ రాజ్‌కోట్‌లో నిర్మించనున్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కు పునాదిరాయి చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రధాని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. 2020.. ఆరోగ్య సంపద అంటే ఏమిటో మనకు నేర్పించిందని అన్నారు. ఆరోగ్యం కంటే గొప్పది ఏదీ లేదని ఈ సంవత్సరం నిరూపించిందని, ఈ సంవత్సరం మొత్తం ప్రపంచానికి సవాలుగా మారిందని, అయితే, ఒత్తిళ్లను జయించి విజయవంతంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తూ ప్రపంచానికి సరఫరా చేసే స్థాయికి చేరడం గర్వించదగిన విషయమన్నారు. కష్టతరమైన ఈ సంవత్సరం సంఘీభావం యొక్క ప్రాముఖ్యతను చూపించింది. కరోనాను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్న సహచరులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులను దేశం ఎన్నటికైనా గుర్తుంచుకుంటుందని ప్రధాని అన్నారు. 


తాజా ఏపి వార్త లకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/