శాస‌న‌స‌భ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు స‌స్పెండ్

ఈ సెషన్ పూర్తయ్యే వరకు కొన‌సాగుతుంద‌ని వివరణ


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో తొలిరోజే గంద‌ర‌గోళం చోటు చేసుకుంది. తెలంగాణ‌ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌ని చెప్పిన‌ బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు అసెంబ్లీలో నినాదాలు చేశారు. దీంతో సమావేశాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆ ముగ్గురు సభ్యుల‌పై స్పీక‌ర్ స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ తీరుపై ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు మండిప‌డ్డారు. ప్ర‌శ్నించే గొంతులను అణ‌చివేయ‌లేర‌ని చెప్పారు. త‌మ‌ను ఎంతగా అణ‌చివేయాల‌నుకున్నా తాము అంతగానూ ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌ని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/