రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌

దళితబంధుకు రూ. 17,700 కోట్లు
పోలీస్ శాఖకు రూ. 9,315 కోట్లు
ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు

హైదరాబాద్: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ను రూపొందించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తెలంగాణను అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయేలా బడ్జెట్ ను తయారు చేశామని చెప్పారు.

బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:

.రాష్ట్ర బడ్జెట్ – రూ. 2,56,958 కోట్లు
.రెవెన్యూ వ్యయం – రూ. 1,89,274.82 కోట్లు
.క్యాపిటల్ వ్యయం – రూ. 29,728.44 కోట్లు
.దళితబంధుకు – రూ. 17,700 కోట్లు
.దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ధి. అతి పెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు రికార్డు సృష్టించింది.
.పోలీస్ శాఖకు రూ. 9,315 కోట్లు
.రూ. 75 వేల లోపు పంట రుణాల మాఫీ
.రూ. 50 వేల లోపు రైతు రుణాలు ఈ నెల చివరిలోపు మాఫీ
.ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
.బీసీ సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు
.బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ. 177 కోట్లు
.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 2,750 కోట్లు
.ఆసరా పింఛన్ కోసం రూ. 11,728 కోట్లు
.డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు రూ. 12,000 కోట్లు
.మన ఊరు – మన బడి కార్యక్రమానికి రూ. 7,289 కోట్లు
.హరితహారం పథకానికి రూ. 932 కోట్లు
.రోడ్లు, భవనాల శాఖకు రూ. 1,542 కోట్లు
.పామాయిల్ సాగుకు రూ. 1,000 కోట్లు
.తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు. కొత్త మెడికల్ కాలేజీలకు రూ. 1,000 కోట్లు. రాబోయే రెండేళ్లలో .అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/