జార్ఖండ్‌లో రైలు ప‌ట్టాల‌పై బాంబు పేలుడు

రాంచీ : జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్ జిల్లాలో శ‌నివారం తెల్ల‌వారుజామున రైలు ప‌ట్టాల‌పై బాంబు పేలుడు సంభ‌వించింది. దీంతో గ‌ర్వా రోడ్డు – బ‌ర్కానా మ‌ధ్య వ‌స్తున్న ఓ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టాన‌స్థ‌లికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఇది న‌క్స‌ల్స్ ప‌నేన‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఈ బాంబు పేలుడు ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. ప‌ట్టాల పున‌రుద్ద‌ర‌ణ ప‌నులను రైల్వే అధికారులు చేప‌ట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/