ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే..బిజెపి ఎమ్మెల్యే మాత్రం ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడు

అసెంబ్లీ లో ప్రజా సమస్యల వినాల్సిన ఓ ఎమ్మెల్యే ..ఏచక్క ఫోన్ ఆన్ చేసి అందులో అశ్లీల చిత్రాలు చూస్తూ బిజీ అయ్యాడు. ఈ ఘటన త్రిపుర అసెంబ్లీలో చోటుచేసుకుంది. బగ్బసా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే జాదబ్ లాల్ నాథ్ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ పై చర్చ జరుగుతుండగా తన ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కారు. ఆయన వెనకాల ఉన్న వారు ఈ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం.

ఈ విషయంపై స్పందించిన బీజేపీ.. వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేను ఆదేశించింది. అయితే ఈ అశ్లీల వీడియోలు చూశారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే నాథ్ మాత్రం స్పందించలేదు. సభ ముగిసిన వెంటనే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని సంబంధిత వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.