శిల్పకళావేదికలో రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్

మాస్ రాజా రవితేజ నటిస్తున్న రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారైంది. ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం రావణాసుర మూవీ తో ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకా డేట్ & వేదిక ను ఫిక్స్ చేసారు.

ఏప్రిల్ 1వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో నివహించబోతున్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ పాల్గొనబోతున్నట్లు తెలిపారు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ – భీమ్స్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.