‘మోడీ హఠావో.. దేశ్ బచావో’ పేరుతో దేశ వ్యాప్తంగా పోస్టర్లు

మోడీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ‘పాన్ ఇండియా’ పోస్టర్ ప్రచారాన్ని మొదలుపెట్టింది.’మోడీ హఠావో, దేశ్ బచావో’ అని రాసి ఉన్న పోస్టర్లను దేశవ్యాప్తంగా 11 భాషల్లో ప్రదర్శించబోతున్నారు. ఢిల్లీలో ‘క్యా భారత్ కే పీఎం కో పడే, లిఖే హోనా చాహియే?’ అని రాసి ఉన్న పోస్టర్లు వెలిశాయి. రీసెంట్ గా దేశ రాజధాని ఢిల్లీ అంతటా గోడలు, విద్యుత్ స్తంభాలపై ‘‘మోడీ హఠావో, దేశ్ బచావో’’ అని రాసిన పోస్టర్లు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని , 49 మంది ఫై ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.

ఈ అరెస్టులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ‘‘స్వాతంత్ర్య ఉద్యమంలో తమకు వ్యతిరేకంగా పోస్టర్లు వేసిన వారిని బ్రిటిష్ వారు కూడా అరెస్టు చేయలేదు. బ్రిటీష్ పాలనలో భగత్ సింగ్ చాలా పోస్టర్లు అతికించారు. ఆయనపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు’’ అని కానీ మోడీ పాలన మాత్రం అరెస్ట్ ల పర్వం కొనసాగుతుందని అన్నారు. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కి వ్యతిరేకంగా బిజెపి సైతం ‘కేజ్రీవాల్ హఠావో, ఢిల్లీ బచావో’ అంటూ ప్రచారం ప్రారంభించింది.