ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్

డైరెక్టర్ హరీష్ శంకర్..శుక్రవారం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామి వారిని హరీష్ శంకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు వారి గోత్రనామాల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీష్ శంకర్ కు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.

అనంతరం హరీష్ శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి అనుబంధ ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రస్తుతం హరీష్ శంకర్ ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో గబ్బర్ సింగ్ వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుంది. ఈ మూవీ ఫై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం చేయనున్నారు.