ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణుల నిరసనలు

బిజెపి ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి శ్రేణులు నిరసనల జరుపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్, కేటీఆర్, కవిత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ..కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. విమర్శలు చేసినంత మాత్రానవ్యక్తిగత దాడులకు దిగడం సరితకాదని అన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న గుండాగిరి, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని , త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ కి తగిన బుద్ధి చెప్తారని నాయకులు అభిప్రాయపడ్డారు.

మరోపక్క కవిత వ్యవహారశైలిపై బీజేపీ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేసారు. కవిత వీధి రౌడీలా మాట్లాడుతోందని విమర్శించారు. శుక్రవారం టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి వెళ్లిన విజయశాంతి వారిని పరామర్శించారు. అర్వింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమన్న ఆమె.. టీఆర్ఎస్ చర్యను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ తన బిడ్డలకైనా మంచి బుద్దులు నేర్పి ఉంటే బాగుండేదని విజయ శాంతి అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.