టీఆర్ఎస్ లో చాలా మంది కట్టప్పలు ఉన్నారు : లక్ష్మణ్

ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా కేసీఆర్ పాలన సాగుతోంది

bjp laxman comments on trs govt

హైదరాబాద్‌ః బీజేపీ రాజ్యసభ సభ్యడు డాక్టర్ లక్ష్మణ్ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది కట్టప్పలు ఉన్నారని… సమయాన్ని బట్టి వారంతా ఆ పార్టీ నుంచి బయటకు వస్తారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని… అందువల్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆ పార్టీలోని కట్టప్పలు అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. వీరి వెనుక బీజేపీ హస్తం లేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తుల కారణంగానే వారు బయటకు వస్తారని అన్నారు.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడం ట్రైలర్ మాత్రమేనని… అసలు సినిమా ముందుందని లక్ష్మణ్ చెప్పారు. ప్రధాని మోదీ ఛరిష్మా ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సరితూగలేరని… అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలిపారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కుట్రలు తెలంగాణలో పని చేయవని అన్నారు. జాతీయ పార్టీ పెడతానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/