వైసీపీ ప్లీనరీ రెండో రోజు 35 రకాల వంటకాలు..

వైసీపీ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు మొదలయ్యాయి. మొదటి రోజు నాల్గు తీర్మానాలకు ఆమోదం తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు..రెండో రోజు ప్లీనరీలో పలు తీర్మానాలు చేయనున్నారు. పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, దుష్ట చతుష్టయంపై ప్లీనరీ తీర్మానాలు చేయనుంది. ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముగింపు ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రెండోరోజు వైఎస్సార్సీపీ ప్లీనరీకి పార్టీ శ్రేణులు పోటెత్తుతున్నారు. రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అభిమానులు సైతం కోలాహలంగా ప్లీనరీకి హాజరవుతున్నారు. ఉదయం నుండి వర్షాన్ని లెక్కచేయకుండా ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. బీహార్, పాట్నా ప్రాంతాల నుండి ప్లీనరీకి వచ్చామని, తమ పార్టీ అధినేత ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు చెపుతున్నారు. ఈరోజు ప్లీనరీకి నాల్గు లక్షల మందికి పైగా హాజరవుతారని పార్టీ వర్గాల అంచనా వేస్తున్నారు. వారందరికీ కూడా రుచికరమైన భోజనం అందించబోతున్నారు. ఈరోజు చివరి రోజు కావడంతో…35 రకాల వంటకాలు ఏర్పాటు చేసింది పార్టీ వర్గం.