కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి

palvai sravanthi went out from counting center

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక​ కౌటింగ్ నడుస్తుంది. ముందు నుండి అనుకున్నట్లే బిజెపి – టిఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పటి వరకు నాల్గు రౌండ్లు పూర్తి కాగా..ఈ నాల్గు రౌండ్లలో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ రౌండ్ లోను ఆధిక్యం చూపించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆశించినంత ఫలితం రాకపోవడంతో.. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు.

ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఏ పాల్.. నోటాకు పోలైన ఓట్లతో పోటీ పడుతున్నారు. తొలి, రెండో రౌండ్‌లో కేఏ పాల్‌కు 34, 35 ఓట్లు పోల్ కాగా, నోటాకు 29, 53 ఓట్లు పోలయ్యాయి. కేఏ పాల్‌కు పోలైన ఓట్ల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉప ఎన్నిక ప్రచారంతో పాటు పోలింగ్ రోజున కేఏ పాల్ హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. గెలుపు నాదే అంటూ ఉరుకులు, పరుగులు పెట్టిన విషయం విదితమే.