ఎన్నికల ప్రచారంలో బిజెపి స్టార్‌ క్యాంపేనర్ల జాబితా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజెపి తరఫున హేమమాలిని ప్రచారం

Bharatiya Janata Party
Bharatiya Janata Party

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే 40 మంది స్టార్ క్యాంపేనర్ల జాబితాను బిజెపి బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో పార్టీ ఎంపీలు హేమమాలిని, సన్నీ డియోల్, హన్స్ రాజ్ హన్స్, గౌతమ్ గంభీర్, రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్ తదితర ప్రముఖులు ఉన్నారు. 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఒకేదశలో పోలింగ్ జరగనున్నది. ప్రధానంగా పోటీ ఆప్, బిజెపి, కాంగ్రెస్ మధ్యే ఉంది. ఇప్పటివరకు వెలువడిన ఎన్నికల సర్వేల ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ 54 నుంచి 64 స్థానాల వరకు గెలుచుకుని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/