దుబ్బాక.. 22వ రౌండ్ లో బిజెపి ఆధిక్యం

Bharatiya Janata Party
Bharatiya Janata Party

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికలలో ఫలితాలు టెన్షన్ రేకెత్తిస్తున్నాయి. 22వ రౌండులో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు 438 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఈ ఆధిక్యతతో కలిపి ఆయనకు మొత్తంమీద 1,058 లీడింగ్ లభించింది. మరో రౌండు కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. చివరి రౌండ్ లో 5,571 ఓట్లను మాత్రమే లెక్కించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చివరి రౌండ్ లో టిఆర్‌ఎస్‌ భారీ ఆధిక్యత సాధిస్తే తప్ప విజయం సాధించడం అసాధ్యం. దీంతో చివరి ఓటు వరకు దుబ్బాకలో టెన్షన్ గానే ఉంటుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/